ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో మంత్రి గన్​మెన్లు.. అమలాపురంలో ఎమ్మెల్సీ.. ఇళ్లను అమ్ముకోనివ్వటం లేదు : ఆరుద్ర - వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ

Kakinada Arudra Complaint On YSRCP Leader : కాకినాడలో తన ఇంటిని అమ్మకోనివ్వకుంటా మంత్రి గన్​మెన్లు అడ్డు తగులుతున్నారని.. ముఖ్యమంత్రిని కలిసిన ఆరుద్ర అనే మహిళ.. ఇప్పుడు కోనసీమ జిల్లా ఎస్పీని కలిశారు. తనకు అమలాపురంలో ఉన్న ఇంటిపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

Kakinada Arudra
కాకినాడ ఆరుద్ర

By

Published : Mar 21, 2023, 10:15 AM IST

కాకినాడ మహిళ ఆరుద్ర

Kakinada Arudra: కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన ఇంటికి అమ్ముకోనివ్వటం లేదని గతంలో ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు మరో చిక్కు వచ్చి పడింది. అమలాపురంలో ఉన్న ఇంటిని సైతం అమ్మనియకుండా వైసీపీ ఎమ్మెల్సీ అడ్డుపడుతున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటిని అమ్ముకొని తమ కుమార్తెకు వైద్యం చేయిద్దామనుకుంటే అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

కాకినాడలో ఉన్న తన భూమి అమ్ముదామనుకున్న సమయంలో.. మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్లు అడ్డుకున్నారని.. ఇప్పుడు అమలాపురంలోని ఇల్లు అమ్మకానికి సైతం, కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ అడ్డుపడుతున్నారని వాపోయింది. మహిళ అని కూడా చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తన ఇళ్లు అమ్ముకుని వచ్చిన నగదుతో వైద్యం చేయించి.. దివ్యాంగురాలైన తన కూతుర్ని కాపాడుకుంటానని అంటోంది.

"కాకినాడలో మంత్రి గన్​మెన్లు ఇల్లు అమ్మకుండా అడ్డు తగులుతున్నారు. ఇప్పటికీ వారికి ఎలాంటి శిక్ష పడలేదు. ఇక్కడ ఇల్లు అమ్మకుండా వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ అడ్డుపడుతున్నారు. మహిళను అని చూడకుండా ఇబ్బంది పెడుతున్నారు." -అరుద్ర

గతంలో ముఖ్యమంత్రిని కలవాటినికి ప్రయత్నించిన ఆరుద్ర :కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కుమార్తె వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. వైద్యం ఖర్చలకు ఆమె దగ్గర నగదు లేకపోవటంతో తన ఇల్లు అమ్మాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమె ఇల్లు అమ్మకుండా ఓ మంత్రి గన్​మెన్​ అడ్డుతగులుతున్నాడని ఆమె వాపోయారు. పలుమార్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అధికారులు స్పందించక పోవటంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు తాడేపల్లి క్యాంపు ఆపీసుకు వెళ్లింది. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంలోని భద్రత సిబ్బంది.. ముఖ్యమంత్రిని కలవకుండా అడ్డుతగలటంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో సీఎంవో కార్యాలయం ఈ ఘటనపై స్పందించి.. ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో అతడు అడ్డుతగులుతున్నాడని ఆమె ముఖ్యమంత్రికి తన గోడును వెల్లబోసుకుంది. సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి హామి ఇచ్చిన వారు అడ్డుతగులుతునే ఉన్నారని ఆమె వాపోయింది. రోజురోజుకు చికిత్స అలస్యం అవుతుండటంతో తన కుమార్తె ఆరోగ్యం విషమిస్తోందని గతంలో ఆమె గతంలో కన్నీటి పర్యంతమైంది.

అరుద్ర ఉదంతంపై కాకినాడ ఎస్పీ కార్యాలయం గతంలో స్పందించింది. అరుద్ర తన ఇంటిని అమ్ముకునే క్రమంలో.. ఇంటి పక్కనే నివాసం ఉంటున్న గన్​మెన్లు తక్కువ ధరకే వారికి విక్రయించాలని బెదిరిస్తున్నారని అరుద్ర ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో నలుగురి వ్యక్తులపై కేసులు నమోదైనట్లు వెల్లడైంది. దీంతో ఈ కేసు విచారణలో ఉండగా.. గన్​మెన్​లను సంబంధిత అధికారులు విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details