Internet problems in amalapuram: అమలాపురంలో విధ్వంసకర ఘటనలతో అధికారులు ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఐదు రోజులైనా.. నెట్ సేవలు పునరుద్ధరించకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ పని చేయక అన్ని రంగాల వారూ అవస్థలు పడుతున్నారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సిగ్నల్స్ కోసం లాప్టాప్, ఫోన్లు పట్టుకొని జిల్లా సరిహద్దులకు తరలిపోతున్నారు. యానాం, కాకినాడ, రాజమహేంద్రవరం, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం.. వంటి దూరప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు.
గోదావరి ఒడ్డున కూర్చుని అతికష్టం మీద విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ సేవలు నిలిచి ఆర్థిక లావాదేవీలు జరగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. అంతర్జాల సేవలు పునరుర్ధరించాలని..లేకపోతే ధర్నాకు దిగుతామని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హెచ్చరించారు.