అమలాపురం కలెక్టరేట్ వద్ద స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద అర్జీదారులను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో 144 సెక్షన్ విధింపు, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు.
పోలీసుల వలయంలో అమలాపురం.. జిల్లా పేరుమార్పు నేపథ్యంలో ముందస్తు చర్యలు - కోనసీమ జిల్లా తాజా వార్తలు
అమలాపురం పోలీసు రక్షణ వలయంలో ఉంది. కోనసీమ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు, అడుగడుగునా పికెటింగ్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు.. కలెక్టరేట్ రెండు గేట్లు మూసివేశారు. కొంతమంది కోనసీమ సాధన సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రీవెన్స్‌కు భారీగా ప్రజలు వస్తారన్న అంచనాతో ముందస్తు చర్యలు చేపట్టారు. అమలాపురంలో 144 సెక్షన్ విధింపు, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు.
పోలీసుల వలయంలో కోనసీమ
మరోవైపు అమలాపురంలోని క్షత్రియ కల్యాణ మండపంలో మంత్రులతో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం జరుగుతోంది. సమావేశంలో మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 450 మంది పోలీసులు, నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలతో భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : May 23, 2022, 2:43 PM IST