Gravel Mining Dispute in Kesavaram Hills :డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం వద్ద ఎర్రమట్టి నిల్వలున్న కొండ ఉంది. స్థానికంగా దీన్ని కర్రవాని మెరక అని పిలుస్తారు. ఈ కొండపై 5 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకాలకు భూ గర్భ, గనుల శాఖ (Department of Mines) అనుమతి ఇచ్చింది. రెండున్న లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి ఉచితంగావైఎస్సార్ జగనన్న కాలనీల్లో (YSR Jagananna Colonies) మెరక పనులు, పునాదుల మధ్య నింపడానికి, ఇతర అవరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.
Illegal Soil Mining in AP : ఈ మట్టిని మండపేట నియోజకవర్గ పరిధిలోనే వాడాలన్న నిబంధనలు విధించారు. అయితే తవ్వకాలు అనుమతులకు మించి సాగుతున్నాయని నిల్వలు పరిధి దాటి రవాణా అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యం పహారా, పగలు, రాత్రి తేడా లేకుండా లారీలు మండపేట, బొమ్మూరు, అనపర్తి వైపు సాగిపోతున్నాయి.
కేశవరం గ్రావెల్ అక్రమ తవ్వకాల పరిశీలనకు టీడీపీ పిలుపు - నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు
లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించని ప్రభుత్వం : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండపై పట్టాలు పొందిన లబ్దిదారులకు నేటికీ స్థలాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పేదల ఇళ్లకు అనువైన స్థలాలు ఎంచుకోకుండా కొండ ప్రాంతాన్ని చూపడమే తప్పయితే.. ఇప్పుడా కొండను మాయం చేసి అక్కడే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని నిర్ణయించడం మరో తప్పనే వాదన వినిపిస్తోంది.