Godavari River Erosion in Lankagrams : జగన్ చెప్పుకొనేదేమో విశ్వసనీయత! చేసేదేమో నయ వంచన! ఈ విషయం కోనసీమ జిల్లా లంక గ్రామల ప్రజలకు బాగా అర్థమైంది. అదిగో వరద అంటే ఇదిగో రివిట్‌మెంట్ అంటూ ఆశలు కల్పించారు. గోదావరి తీరం కోతకు గురికాకుండా గ్రోయిన్లు నిర్మిస్తామని నమ్మబలికారు! 5 వారాల్లో పనులు ప్రారంభిస్తానని చెప్పి 5నెలలైనా తట్టమట్టి కూడా వేయలేదు. లంక గ్రామాల ఆశల్ని గోదాట్లో కలిపేశారు.
కోతకు గురవుతోన్న గోదావరి గట్టు - జగన్ హామీ నెరవేరితే ఒట్టు! Konaseema District Godavari Erosion : 2022 ఆగస్టు 8న ముఖ్యమంత్రి జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించి ఇచ్చిన హామీ ఇది! ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గంలోనే గోదావరి కోతకు అడ్డుకట్ట వేసేలా గ్రోయిన్ల నిర్మాణానికి 200 కోట్లు ఇస్తామన్నారు. పదిరోజుల్లో అంచనాలు తయారు చేయిస్తానన్నారు! ఎన్ని పదిరోజులు గడిచాయో లెక్కలేదు! నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. ఐదు నెలలు గడిచినా అతీగతీలేదు. ముమ్మిడివరం నియోజకవర్గంలోనే 5ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణానికి జలవనరులశాఖ 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికీ వాటికి పాలనామోదం ఇవ్వలేదు. రాజోలు మండలం మేకలవానిపాలెం, బూరుగులంక వద్ద కూడా గ్రోయిన్ల నిర్మాణం చేపడతామని సీఎం 2022లో స్వయంగా మాటిచ్చారు. అదీ దిక్కులేదు. మళ్లీ వరదలు వస్తే పరిస్థితేంటని లంకగ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. విశ్వసనీయత అని గొప్పలు చెప్పుకుంటూ ఆ పదాన్నే గోదాట్లో కలిపేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు
Negligence Construction of Godavari Embankments : దాదాపు ఐదేళ్ల పాలనలో వైసీపీ సర్కార్ గోదావరి కరకట్టల పటిష్ఠానికి ఒక్క ఏడాదీ నిధులివ్వలేదు. బలహీనంగా ఉన్న చోట్ల గ్రోయిన్లు, రివిట్‌మెంట్లు నిర్మించేందుకు నిపుణుల నివేదిక ఆధారంగా అడుగులు వేసే ప్రయత్నమూ చేయలేదు? గోదావరి పొంగితే హెలీకాప్టర్‌లో వచ్చారు! ఎక్కడో ఒక చోట దిగి ఉత్తుత్తి హామీలు కుమ్మరించి వెళ్లారు. ఇంతకుమించి లంకగ్రామాలకు జగన్ ఒరగబెట్టిందేమీలేదు. 2020, 2022, 2023సంవత్సరాల్లో గోదావరి నదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఎక్కడ గండిపడుతుందో అనే భయాలతో ఎవరికీ కంటిమీద కునుకు లేదు. 2021లోనే కరకట్టల దుస్థితిపై నిపుణుల కమిటీ సర్కార్కు నివేదిక ఇచ్చింది. దాదాపు 37 చోట్ల గోదావరి గట్లు బలహీనంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఇసుక తవ్వకాల వల్ల కూడా గోదావరి కరకట్టలు బలహీనపడుతున్నాయని హెచ్చరించింది. గోదావరి, గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి, వైనతేయ పాయల వెంట ఊళ్లను ఆనుకుని కరకట్టల వద్ద ఇసుక తవ్వకాలు భారీగా సాగుతున్నాయని గుర్తించింది. ఈ నివేదికపై జగన్ సర్కార్ ఏ చర్యలూ తీసుకోలేదు. గోదావరి కరకట్టల పటిష్ఠానికి అడుగులు వేయలేదు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి - మా ఇళ్లను కాపాడండి! అన్నమయ్య జిల్లా గుంజన నది తీరం ప్రజలు
పోలవరం దిగువన అఖండ గోదావరికి ఎడమ వైపున ధవళేశ్వరం, కుడి వైపున విజ్జేశ్వరం వరకూ ఏటిగట్లు పటిష్ఠం చేయాల్సి ఉంది. 1953లో 30లక్షల క్యూుసెక్కుల వరదలకు 14చోట్ల కరకట్టలకు గండ్లు పడి కోనసీమ ప్రాంతం బాగా దెబ్బతింది. 1986లో అత్యధికంగా 36లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. ఆ వరద మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇంకా 56 కిలోమీటర్ల మేర కరకట్టల ఎత్తు పెంచడంతో పాటు పటిష్ఠ పరచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కానీ సీఎం జగన్ వారంలో కమిటీ, నెలలో టెండర్ అంటూ మాటిచ్చి మడమ తిప్పేశారు.