ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FLOOD VICTIMS: ఇంకా వరదలోనే రాజోలు.. తాగునీరు లేక అవస్థలు - కోనసీమ జిల్లా తాజా వార్తలు

FLOOD VICTIMS: కోనసీమ జిల్లా రాజోలు పరిధిలోని పది గ్రామాలు.. ఏడు రోజులుగా నీటిలో నానుతున్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, తూర్పులంక, పెదలంకలో తాగునీరు, భోజనం కూడా అందడం లేదని గ్రామస్థులు వాపోయారు. చిన్నపిల్లలకు పాలు, బ్రెడ్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి కనీస సహాయ చర్యలు కూడా లేవని మండిపడ్డారు.

FLOOD VICTIMS
FLOOD VICTIMS

By

Published : Jul 19, 2022, 6:42 PM IST

ఇంకా వరదలోనే రాజోలు.. తాగునీరు లేక అవస్థలు

FLOOD VICTIMS: కోనసీమ జిల్లా రాజోలు పరిధిలోని పది గ్రామాలు.. ఏడు రోజుల నుంచి వరద నీటిలోనే నానుతున్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, తూర్పులంక, పెదలంక గ్రామాలకు తాగునీరు, భోజనం అందక ఇబ్బందులు పడుతున్నామని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి వరదలు చూస్తున్నామని.. ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని ఆవేదన చెందుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సహాయక చర్యలు అందించడంలో రాజీపడేవారు కాదని.. ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళలు వాపోయారు.

చిన్నపిల్లలకు కనీసం బ్రెడ్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదని.. ఇంటిలో ఉన్న నిత్యావసరాలతోనే డాబాలపై తలదాచుకుంటున్నామని తెలిపారు. బయటికి వెళ్లడానికి పడవలు కూడా సరిగా లేవని.. మూడు వేల కుటుంబాలకు 20 పడవలు ఇచ్చారని ఆవేదన చెందారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కేవలం రెండు భోజన పొట్లాలు మాత్రమే ఇస్తున్నారని.. వీటితో ఎలా బ్రతకాలని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details