Antharvedi Mini Fishing Harbour: కోనసీమ జిల్లాలోని అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చి చేపల వేట సాగిస్తుంటారు. ఎండకు వానకు తలదాచుకోవడానికి సదుపాయాలు లేక, మత్స్యకారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016లో 33 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ పనులు చేపట్టారు. వివిధ విభాగాలకు సంబంధించి 8 భవనాలు నిర్మించాల్సి ఉండగా ఆరు భవనాలు పూర్తి చేశారు. వీటికి విద్యుత్, తాగునీరు వసతులు లేవు. హార్బర్ నిర్మాణంతో కష్టాలు తీరుతాయనుకున్న మత్స్యకారులు..వసతులు లేక నిరాశ చెందుతున్నారు.
అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల కష్టాలు..
Antharvedi Mini Fishing Harbour: ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మత్స్యకారులు.. సముద్రంలో చేపలు పట్టి విక్రయిస్తుంటారు. అంతర్వేదీ మినీ ఫిషింగ్ హార్బర్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది మత్స్యకారులు, వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. వీరికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారులు విక్రయించిన చేపలను నిల్వ చేసుకోవడానికి వసతులు లేకపోవడం వల్ల.. తక్కువ ధరకే చేపలను ఎగుమతి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా మత్యకారులు, వ్యాపారుల ఆదాయానికి గండి పడుతోంది. నిర్మాణం పూర్తైన భవనాలకు తాళాలు వేయడం వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పాకలు వేసుకుని చేపల క్రయవిక్రయాలు చేస్తున్నామని వ్యాపారులు చెప్తున్నారు. మిగిలిన భవన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
TAGGED:
Fishermens Problems