government is not buying grain: రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వరుణుడి ఆగ్రహంతో అంతా తల్లకిందులైంది. వాయుగుండం ప్రభావంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు మమ్మరంగా సాగుతున్నాయి. ప్రతికూల వాతావరణంతో రైతులు ధాన్యాన్ని గట్టెక్కించుకొనేందుకు వీలు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తేమ శాతం తగ్గేలా ధాన్యాన్ని ఆరబెట్టి కల్లాల్లో రాశులు చేసి ఉంచినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద వేగంగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
వరుణుడు ఆగడం లేదు.. ప్రభుత్వం కొనడం లేదు..!
Farmers are suffering government is not buying grain: కోనసీమ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోసి ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోతున్నాయని.. రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు కోసి ధాన్యాన్ని ఆరబోసినా.. కొనుగోలు కేంద్రాల వద్ద వేగంగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం అమ్మకాలకు అనేక నిబంధనలు పెట్టడంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకముందే వేగంగా కొనుగోలు చేయాలని మొరపెట్టుకుంటున్నారు..
ధాన్యం అమ్మకాలకు అనేక నిబంధనలు పెట్టడంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. సరిపడా సంచులు ఇవ్వడం లేదని, తేమ శాతం తగ్గిపోయి పరిమితికి లోబడి ఉన్న ధాన్యాన్ని విక్రయిందామన్నా.. కొనుగోలు కేంద్రాల వారు తీసుకువెళ్లడం లేదని అంటున్నారు. మూడు రోజుల నుంచి ప్రతికూల వాతావరణంలో ధాన్యం రాశుల్లో ఉందని తెలిపారు. వర్షపు నీరు రాశుల కిందకు చేరి ధాన్యం తడుస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రైతులు మొరపెట్టుకుంటున్నారు.
ఇవీ చదవండి: