ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినతిపత్రం ఇస్తామని చెప్పారు.. విధ్వంసం సృష్టించారు : డీఐజీ - కోనసీమ హింసపై ఏలూరు రేంజ్​ డీఐజీ వివరణ

eluru range dig
ఏలూరు రేంజ్​ డీఐజీ

By

Published : May 25, 2022, 11:25 AM IST

Updated : May 25, 2022, 12:39 PM IST

11:21 May 25

46 మందిని అదుపులోకి తీసుకున్నాం : డీఐజీ

కోనసీమ విధ్వంస ఘటనపై ఏలూరు రేంజ్​ డీఐజీ వివరణ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఆందోళనకారులను చెదరగొట్టామని.. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని తెలిపారు. కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇస్తామని చెప్పారని.. అదేసమయంలో వెనుకనుంచి ఒక్కసారిగా కొంతమంది దూసుకొచ్చారని వివరించారు. నిరసనకారుల్లో కొంతమంది విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఇప్పటివరకు 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఆందోళనకారులపై ఆరు కేసులు నమోదు చేశామని, ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి సీనియర్‌ పోలీసు అధికారులు వచ్చారని తెలిపారు. శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో అందరూ సహకరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details