కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని... కోనసీమ జిల్లా బంద్ పిలుపు ఉద్రిక్తంగా మారింది. బోడసకుర్రు బ్రిడ్జ్‌పై ఆందోళనకారులు రాకపోకలను స్తంభింపజేశారు. అరెస్టు చేసిన సాధన సమితి నాయకులను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 'కోనసీమ జిల్లా వద్దు అంబేద్కర్ జిల్లా ముద్దు' అంటూ నినాదాలు చేశారు. అమలాపురంలో జరిగే బందులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బంద్ ప్రభావంతో పట్టణంలో వ్యాపారాలన్నీ మూతపడ్డాయి.
కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని నిరసన - కోనసీమ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా బంద్‌కు అంబేద్కర్ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బోడసకుర్రు బ్రిడ్జ్‌పై నేతలు ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు.
అంబేద్కర్ జిల్లా సాధన సమితి