ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 26న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన - సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ ఈనెల 26న కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ నెల 26న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

By

Published : Jul 23, 2022, 8:41 PM IST

గోదావరి వరద బాధితులను ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించనున్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. సీఎంవో నుంచి అందిన సమాచారతో.. జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, జి. పెదపూడి లంక గ్రామాల్లోని వరదనష్టాన్ని సీఎం పరిశీలించే అవకాశం ఉంది. కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details