CM TOUR:ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో నేడు సీఎం జగన్ పర్యటన సాగనుంది. తొలుత ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కన్నయ్యగుట్టలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తిరుమలాయపురం, నార్లవరం ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడతారు. తిరుమలాయపురం వరదప్రాంతాల ఫొటో ప్రదర్శన తిలకించనున్నారు. రేపు మధ్యాహ్నం ముంపుగ్రామాల నుంచి సీఎం తిరుగు పయనం కానున్నారు.
CM TOUR IN KONASEEMA:మంగళవారంకోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి పి. గన్నవరం మండలం జి.పెదపూడిలంక చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి బూరుగులంక రేవుకు వెళ్లారు. పంటు ఎక్కి వశిష్ట గోదావరి దాటిన జగన్... ట్రాక్టర్‌పై లంక గ్రామాలను పరిశీలించారు. పుచ్చకాయలవారిపేట, అరిగెలవారిపేట, ఉడిమూడిలంకల్లోని వరద బాధితులతో మాట్లాడారు. జి.పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.