ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాన్యులకు బ్యాడ్​న్యూస్.. నెలనెలా కరెంట్ షాక్ - నిబంధనలను సవరించిన కేంద్ర విద్యుత్తు శాఖ

Electricity Charges hike in India : విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని నెలనెలా ఆటోమేటిక్‌గా వినియోగదారుడిపై వేసేలా విద్యుత్తు కమిషన్‌ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్తుశాఖ తాజాగా పేర్కొంది. ఇందుకుగాను విద్యుత్తు నిబంధనలు-2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేసింది. దీంతో భారాన్ని నెలవారీగా ఆటోమేటిగ్గా వినియోగదారుల టారిఫ్‌కి మళ్లించేలా విద్యుత్తు కమిషన్‌ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని ఈ నిబంధనల్లో తెలిపింది.

Power bill
పవర్ బిల్

By

Published : Jan 4, 2023, 12:01 PM IST

Electricity Charges hike in India : విద్యుదుత్పత్తికి వినియోగించే ఇంధనం ఛార్జీలు, విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్‌గా వినియోగదారుడిపై వేసేలా విద్యుత్తు కమిషన్‌ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్తుశాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు విద్యుత్తు నిబంధనలు-2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేసింది. భారాన్ని నెలవారీగా ఆటోమేటిగ్గా వినియోగదారుల టారిఫ్‌కి మళ్లించేలా విద్యుత్తు కమిషన్‌ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. ఆ నెలవారీ ట్రూఅప్‌ ఛార్జీలను వార్షిక ప్రాతిపదికన నిర్ధారించాలని స్పష్టంచేసింది. విద్యుత్తు కమిషన్‌ ఈ కొత్త ఫార్ములా ఖరారు చేసేంతవరకూ ఈ నిబంధనల్లో చెప్పిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంచేసింది.

  • ఇంధనం, విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు సర్‌ఛార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తుసరఫరా చేయడానికి అయ్యేఖర్చు పెరగడమని అర్థం చేసుకోవాలి.
  • ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లుల్లో కలపాలి. నియంత్రణ సంస్థ అనుమతుల ప్రక్రియ అవసరం లేకుండానే రాష్ట్ర కమిషన్‌ నిర్దేశించిన ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్‌గా నెలవారీగా ఈ పనిచేయాలి.
  • ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులు, అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల్లో నెలవారీగా వచ్చిన వాస్తవ తేడా ఆధారంగా ఈ సర్‌ఛార్జిని లెక్కించాలి. ఉదాహరణకు ఏప్రిల్‌ నెలలో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులో తేడా వస్తే ఆ భారాన్ని జూన్‌ నెల బిల్లులో కలపాలి.
  • వినియోగదారులకు టారిఫ్‌ షాక్‌లు ఇవ్వకుండా డిస్కంలు ఎప్పటికప్పుడు ఇంధన, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులను లెక్కించి ఆ తర్వాతి నెలలో వాటిని బిల్లుల్లో చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండునెలలకు మించి జాప్యం జరగకూడదు.
  • విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ ముందుకు ఏదైనా వివాదం వస్తే దాన్ని 120 రోజుల్లోపు పరిష్కరించాలి. ఆ పరిమితిని స్పష్టమైన కారణాలతో మరో 30 రోజులు పొడిగించవచ్చు. ఏదైనా కారణంతో తుది ఉత్తర్వు వెలువరించలేని పరిస్థితి ఉంటే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా పేర్కొంటూ కమిషన్‌.. పైన పేర్కొన్న కాలపరిమితి లోపు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. 120/150 రోజుల్లోపు తుది ఉత్తర్వులు వెలువడని పరిస్థితి ఉంటే ఉపశమనం కోసం బాధిత పక్షం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడానికి ఈ కొత్త నిబంధన వీలు కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details