NO INTERNET: కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంసానికి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు.. అధికారుల ఆదేశాలతో అంతర్జాల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు దాని ప్రభావం అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మడివరంలోని వ్యాపారులపైనా పడింది. ఇంటర్నెట్ అందుబాటులో లేక నెట్ సెంటర్లు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు, రిజర్వేషన్ బుకింగ్ సెంటర్లు, మందుల దుకాణాలు, సెల్ ఫోన్ రీఛార్జ్ సెంటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా.. డిజిటల్ పేమెంట్ చేయటానికి అలవాటు పడినవారు.. ప్రస్తుతం నెట్ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
అమలాపురం ఎఫెక్ట్.. ఆ ప్రాంతాల్లోనూ ఆన్ లైన్ అవస్థలు..! - కోనసీమ జిల్లా తాజా వార్తలు
NO INTERNET: నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఉన్నా.. తప్పక ఆన్ లైన్లో ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అంతగా అలవాటు పడ్డ జనం.. ఉన్నట్టుండి నెట్ సేవలు స్తంభించడంతో నానా అవస్థలు పడుతున్నారు. అమలాపురం ఎఫెక్ట్ కాస్తా.. కూతవేటు దూరంలో ఉన్న ముమ్మడివరంలోని ప్రజలపైనా పడింది..!
ముమ్మడివరంలో 'నెట్' కష్టాలు తీరేదెన్నడో