ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక వనసమారాధనలో అపశ్రుతి.. పలువురిపై తేనెటీగల దాడి

Bees attacked during Vanasamaradhana in AP: కోనసీమ జిల్లా అంకంపాలెంలో వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పలువురిపై తేనెటీగలు దాడి చేశాయి. స్థానిక ఆలపాటి వారి తోటలో వన విహారయాత్రలో సందడి చేస్తున్న 25 మందిని తేనెటీగలు ఒక్కసారిగా కప్పేశాయి. గాయపడిన 10 మందిని రావులపాలెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Bees attacked
Bees attacked

By

Published : Nov 20, 2022, 7:57 PM IST

Bees attacked during Vanasamaradhana program: వనసమారాధన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆలపాటి వారి తోటలో కుటుంబసభ్యులందరూ వనసమారాధన జరుపుకోవడానికి తోటకు వచ్చారు. తోటలో కార్తిక వనసామారధన జరుపుకుంటుండగా.. చెట్టుపై ఉన్న తేనెటీగలు చెలరేగాయి. దీంతో అక్కడ ఆటపాటలతో పాటుగా.. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న 25 మందిపై తేనెటీగలు దాడి చేశాయి.

ఒక్కసారిగా జరిగిన హఠాత్పారిణామంతో వారంతా హాహాకారాలు చేసుకుంటూ పరుగులు తీశారు. వారిలో 10 మంది వరకు అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆలపాటి సత్యవతి, కృష్ణకుమారిల పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కార్తిక వనసమారాధనలో తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details