మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో చేదు అనుభవం ఎదురైంది. తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు నాయకుల నుంచి మంత్రికి నిరసన సెగ తగిలింది. శెట్టిబలిజ సామాజికవర్గం నాయుకులు వేణు.. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. శనివారం అమలాపురంలోని ఓ హోటల్‌లో కోనసీమ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, పినిపే విశ్వరూప్, ఎంపీలు మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ హాజరయ్యారు. గత నెల 29న మంత్రి వేణుగోపాలకృష్ణ.. వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లడాన్ని నిరసిస్తూ.. శెట్టిబలిజ మహనాడు నాయకులు మంత్రిని అడ్డుకునే యత్నం చేశారు. శెట్టిబలిజల పరువు తాకట్టు పెట్టారంటూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంత్రి తీరు శెట్టిబలిజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని నాయకులు అన్నారు.
మంత్రి వేణుగోపాలకృష్ణకు అమలాపురంలో చేదు అనుభవం - కోనసీమ జిల్లా వార్తలు
Minister Venugopalakrishna: రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు అమలాపురంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. శెట్టిబలిజ సామాజికవర్గం నాయుకులు వేణు.. తన మంత్రి పదవికి రాజీనామ చేయాలని నినాదాలు చేశారు. మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అది నా సంప్రదాయం: ఈ ఘటనపై మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందించారు. కుడుపూడి చిట్టబ్బాయి ప్రథమ వర్థింతి సభలో 'నేను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాదాలకు నమస్కరించడం సంస్కారం' అని మంత్రి సమర్థించుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారే తనను అడ్డుకున్నారని.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అయితే.. తనపైకి శెట్టిబలిజ నాయకులు వస్తుంటే.. మీరేం చేస్తున్నారని పోలీసులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నాగార్జున వర్సిటీలో.. తొలిరోజు ఉద్యోగ మేళా విజయవంతం