Attack on Two youths: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం ఉప విద్యుత్తు కేంద్రం సమీపంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులపై కత్తితో దాడి జరిగింది. లక్కవరానికి చెందిన పిట్టా వెంకట్ అనే యువకుడు.. సఖినేటిపల్లి మండలం వీవీ మెరకకు చెందిన ఉప్పు నాని, సరెళ్ల మనోహర్ జోషిని కత్తి పొడిచి పరారయ్యాడు. ఉప్పునాని, పిట్టా వెంకట్‌కు గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇరువురు మాట్లాడుకుంటూ ఉండగా ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడ ఉన్న మనోహర్ జోషి అడ్డుగా వెళ్లడంతో అతనిపై కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. బాధితులను వైద్యం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యానికి అమలాపురం కిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Attack: పాత గొడవలతో ఇద్దరు యువకులపై కత్తితో దాడి... ఎక్కడంటే..? - మకిలిపురంలో ఇద్దరు యువకులపై కత్తితో దాడి
Attack on Two youths: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మకిలిపురంలో పాత గొడవల కారణంగా ఓ వ్యక్తి ఇద్దరిని పొడిచి పారిపోయాడు. వీవీ మెరకకు చెందిన ఉప్పు నాని, మనోహర్ జోషిపై... లక్కవరానికి చెందిన పిట్టా వెంకట్ దాడి చేశాడు. బాధితులు అమలాపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత గొడవలే కత్తిపోట్లకు కారణమని పోలీసులు తెలిపారు.
ఇద్దరు యువకులపై కత్తితో దాడి