కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్‌లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు AP High Court Angry on Govt About Lack of Facilities in Hostels:వసతి గృహాల్లో సౌకర్యాల లేమిపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు పడుకోవడానికి కనీసం మంచం, పరువు సౌకర్యం కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత కాదా అంటూ.. ఇలాంటి పరిస్థితులు ఉండే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Bad Condition of Govt Hostels: శిథిలావస్థలో ఎస్సీ బాయ్స్ హాస్టల్.. అరకొర సౌకర్యాలతో విద్యార్థుల అవస్థలు
సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పేద విద్యార్థులే చదువుతుంటారని, ఇతరులతో సమానంగా వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 190 గురుకుల పాఠశాలల్లో లక్షా 70 వేల మంది విద్యార్థులకు మంచాలు, నాణ్యమైన పరుపులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. 400 వందల మంది విద్యార్థులకు రెండు టాయిలెట్లు ఉండటంపై ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది.
Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, వసతి గృహంలో అసౌకర్యాలపై సామాజిక కార్యకర్త బాజ్జీ దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు మంచాలు, పరుపులు లేక కిందే పడుకుంటున్నారని.. కనీసం దుప్పట్లు అందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వసతుల మెరుగు పరిచేందుకు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. వసతి గృహంలో సౌకర్యాల కల్పనకు ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. వసతి గృహానికి కేటాయించిన 84లక్షల నిధులను సరైన మార్గంలో వినియోగించాలని ఇంజనీర్లను హైకోర్టు ఆదేశించింది.
Social Welfare Hostels Probelms: "జగన్ మామయ్య.. మా హాస్టల్స్ ఎప్పుడు బాగుపడతాయి".. నెల్లూరులో శిథిలావస్థకు హాస్టల్స్
పనులన్ని పూర్తయ్యాక హైకోర్టు సీనియర్ అధికారి పనులను పరిశీలిస్తారని, లోపాలేమైనా ఉంటే ఆ ఇద్దరు ఇంజనీర్లు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. నాణ్యత విషయంలో రాజీపడొద్దని పేర్కొంది. ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండాలంది. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించేందు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అకస్మిక తనిఖీలు చేయాలని పేర్కొంది. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు మంచాలు, పరుపులు ఇచ్చే విషయంపై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గోడి వసతి గృహంలో దయనీయ పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తెచ్చినందుకు పిటిషనర్ బాబ్జీని అభినందిస్తున్నట్లు హైరోర్టు ధర్మాసనం పేర్కొంది.