Teacher Punished Student in Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలోని జడ్పీ పాఠశాల ఎదుట దళిత, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఐదో తరగతికి చెందిన దళిత విద్యార్థిని.. సైన్స్ ఉపాధ్యాయుడు బాబా మందలించి.. చెత్త బుట్టలో కూర్చోబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి అసభ్యకరంగా మాట్లాడడనే నెపంతో ఉపాధ్యాయుడు ఈ పని చేశాడని... తాను బూతులు తిట్టలేదని విద్యార్థి చెప్పినా ఉపాధ్యాయుడు వినకుండా బుట్టలో కూర్చోబెట్టి దానిపై మూత కూడా పెట్టాలని చూశారన్నారు.
విద్యార్థిని చెత్తబుట్టలో కూర్చోబెట్టిన ఉపాధ్యాయుడు.. విద్యార్థి సంఘాల ఆందోళన - మండల విద్యాశాఖాధికారి
Teacher punished student: విద్యార్థిని చెత్తబుట్టలో కూర్చోబెట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అంతర్వేదిపాలెంలోని జడ్పీ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి బూతులు మాట్లాడటమే కాకుండా.. తన మాట వినలేదని ఉపాధ్యాయుడు చెప్పగా... తానేమీ అలా మాట్లాడలేదని విద్యార్థి అంటున్నాడు. ఈ వ్యవహారాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
విద్యార్థిని చెత్త బుట్టలో కూర్చోబెట్టిన ఉపాధ్యాయుడు
ఈ ఘటనకు పాల్పడిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాతపూర్వకంగా మండల విద్యాశాఖాధికారికి తెలియజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
ఇవీ చదవండి: