ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యూషన్ మాస్టర్​ను సత్కరించడానికి విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు... - మాస్టారి శిష్యులు

Panchmukhi Tuition Master: ఆ ఉపాధ్యాయుడిని సన్మానించు కోవడానికి దేశ, విదేశాల నుంచి శిష్యులు తరలివచ్చారు. ఆయనకు సన్మానం అని తెలిసిన వెంటనే విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని వాలిపోయారు ఆ విద్యార్థులు. కేవలం ట్యూషన్ చెప్పారనే కారణంతో 500 మంది విద్యార్థులు ఆ గురువును సత్కరించుకున్నారు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకపల్లి సమీపంలోని చోటుచేసుకుంది.

500 former students
తాత సుబ్రమణ్య పంచముఖి ట్యూషన్ మాస్టర్​

By

Published : Jan 14, 2023, 9:00 PM IST

Updated : Jan 14, 2023, 9:06 PM IST

500 former students honor Tuition Master: ఆయన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు.. విశ్రాంత అధ్యాపకులు కాదు.. ముదిమి మీద పడిన సాధారణ ట్యూషన్ మాస్టర్. పంచముఖి ట్యూషన్ మాస్టర్​గా పేరుగాంచారు. బ్రహ్మచారి.. ట్యూషన్ ఫీజులు తీసుకోకుండా సుమారు 40 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా బోధన చేస్తున్నారు. అలాంటి గురువును దేశ విదేశాలకు చెందిన శిష్య బృందం సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. తమకు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలతో పాటుగా.. జీవిత పాఠాలను నెమరు వేసుకున్నారు. తమ జీవితంలో ఈ మార్పునకు కారణం ఆ మాస్టార్ చలవేనంటూ వెల్లడించారు. తమ బాల్య జ్ఞాపకాలను తోటి స్నేహితులతో పంచుకున్న సంఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.

తాత సుబ్రమణ్య పంచముఖి ట్యూషన్ మాస్టర్​
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొంకాపల్లికి చెందిన తాత సుబ్రమణ్య.. పంచముఖి ట్యూషన్ మాస్టర్​గా పేరుగాంచారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. వివాహం చేసుకుంటే వ్యక్తిగత బంధాలు స్వార్ధాలు ఏర్పడతాయనే భావంతో వివాహం చేసుకోకుండా తన వద్ద శిష్యరికం చేసిన పిల్లలను తన బిడ్డలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించారు. అలాంటి గురువును కొంకపల్లి సమీపంలోని పేరూరులో ఏర్పాటుచేసిన సన్మాన సభలో సుమారు 500 మంది విద్యార్థులు అత్యంత ఘనంగా సత్కరించారు. అమెరికాలో ఉంటున్న శిష్యులే కాకుండా.. ఢిల్లీ, ముంబై, కోల్​కతా, హైదరాబాద్, చెన్నై తదితర దూర ప్రాంతాల్లో వేరువేరు ఉద్యోగాల్లో స్థిరపడిన శిష్య బృందం రెక్కలు కట్టుకుని పేరూరు వచ్చి అభిమాన గురువు పంచముఖి మాస్టారును ఘనంగా సన్మానించారు. దాదాపు 40 సంవత్సరాల అనంతరం కలిసిన శిష్య బృందం గురువును చూసి తన్మయం చెందారు. అలాగే మిత్రులు స్నేహభావంతో కుటుంబాలతో వచ్చి ఆత్మీయ అనురాగాలను నెమరు వేసుకున్నారు.

'నా వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులందరూ... దేశ, విదేశాల్లో ఉండటం నాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో ఉండటం ఆనందాన్ని ఇచ్చింది. వీళ్లను చూస్తే నాకు పిల్లలు లేరన్న బాధ ఉండదు. నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి.' -పంచముఖి ట్యూషన్ మాస్టర్

'గురువుగారు మాకు దేవుడితో సమానం. గురువుగారు మాకు విద్య నేర్పడమే కాదు, మంచి బుద్ధులు సైతం నేర్పించారు. ఆయన వల్లే మేము ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నాం. గురువు గారు అందరిని ఒకే రకంగా చూసేవారు. ఆయన కర్మయోగి. మాస్టార్ చెప్పే విధానం అందరికి అర్థమయ్యేట్లుగా ఉంటుంది. ఆయన వద్ద విద్యనేర్చుకున్న విద్యార్థులు అమెరికా, కెనడా, జపాన్, లాంటి దేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి గురువును జీవితంలో మళ్లీ చూడటం కష్టం.'- మాస్టారి శిష్యులు

ఇవీ చదవండి:

Last Updated : Jan 14, 2023, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details