అమలాపురం అల్లర్లు.. 19 మంది అరెస్ట్: డీఐజీ పాలరాజు - eluru range dig pala raju amalapuram violation incident
![అమలాపురం అల్లర్లు.. 19 మంది అరెస్ట్: డీఐజీ పాలరాజు eluru range dig pala raju amalapuram violation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15395283-675-15395283-1653583977464.jpg)
21:30 May 26
అమలాపురం ఘటనలో మరి కొంతమంది అనుమానితులను గుర్తించామన్న డీఐజీ పాలరాజు
DIG Palaraju on Amalapuram issue: అమలాపురంలో అల్లర్ల ఘటనలో 19 మందిని అరెస్టు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. వారిపై 307 సహా పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మరికొంత మంది అనుమానితులను గుర్తించామన్న ఆయన.. శుక్రవారం వారినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపేసిన ఇంటర్నెట్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు. అంతేకాకుండా అల్లర్లకు సంబంధించి పోలీసు శాఖలో తలెత్తిన అంతర్గత లోపాలను సమీక్షించుకుంటున్నామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు.
కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఆందోళన వ్యవహారంలో ఇప్పటికే 48 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి తాజాగా 19 మందిని అరెస్టు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు వెల్లడించారు.
ఇదీచదవండి: