ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్యకర్తలకు కోపమొచ్చింది.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నారు - వైసీపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

YSRCP leaders blocked the MLA : కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో అనపర్తికి సొంతపార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. గ్రామంలోని సూర్యనారాయణ స్వామి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయంలోకి అనుమతించబోమంటూ స్థానిక వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వామి ఉత్సవంలో భాగంగా పలు క్రీడలకు పోలీసుల అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP MLA
వైసీపీ ఎమ్మెల్యే

By

Published : Feb 1, 2023, 9:07 PM IST

YSRCP leaders blocked the MLA : కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్లిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యేను ఆలయంలోకి అనుమతించమంటూ అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

సూర్యనారాయణ స్వామి ఉత్సవంలో భాగంగా గుండాట, ఇతర ఆటలకు పోలీసుల నుంచి అనుమతి తీసుకురాలేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గుడిలోనికి వెళ్లకుండా స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే కారుకు అడ్డంగా నిలబడి.. రోడ్డుపై బైఠాయించి 'ఎమ్మెల్యే గో బ్యాక్.. ఎమ్మెల్యే డౌన్​ డౌన్​' అంటూ నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పెదపూడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారుల నుంచి ఎమ్మెల్యేను క్షేమంగా అక్కడినుంచి పంపించారు.

వైసీపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న సొంత పార్టీ నేతలు


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details