Telangana byelection 2023 : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. అయితే ఆ నియోజక వర్గం ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా? జరగదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజనీతిశాస్త్ర నిపుణుడు బీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఎంపీ కానీ ఎమ్మెల్యే చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151 ఏ ప్రకారం 6 నెలల్లోపు ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలి. దీని ప్రకారం ఆగస్టు 20 లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
శాసనసభ గడువు పూర్తి .. ఎన్నికలు కష్టం: మే నెల కంటే ముందే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక రావాలి. కానీ, తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబరుతో పూర్తి అవుతుంది. అంటే గడువు మరో 10 నెలలే ఉంది. లోక్‌సభ కానీ అసెంబ్లీ గడువు సంవత్సరంలోపు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి.. ఎన్నికలు నిర్వహించడం కష్టమని ధ్రువీకరిస్తుంది.