కాకినాడలో వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం, ఇద్దరు మృతి
19:15 August 20
మరొకరికి తీవ్రగాయాలు, జీజీహెచ్‌కు తరలింపు
Blast in kakinada: కాకినాడ ఏటిమొగలోని పోర్ట్ కెనాల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న బార్జ్‌లో పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నౌకాశ్రయంలో సరకు రవాణా చేసేందుకు వినియోగించే 16వ బార్జీని గత కొన్ని రోజులుగా నిర్మాణం చేస్తున్నారు. పనులు పూర్తి చేసేందుకు ముగ్గురు కార్మికులు వెల్డింగ్ చేసేందుకు లోపలకు దిగారు. ఒక్కసారిగా గ్యాస్ హోస్ పైపు తెగిపోయి పేలింది. శ్రీను, రవి అనే కార్మికులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. బార్జీ కళాసీ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని తోటి కార్మికులు, వన్ టౌన్ పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు వచ్చి రోదించారు. డీఎస్పీ భీమారావు, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి జీజీహెచ్ వద్దకు వచ్చి బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: