ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JNTUలో సందడిగా అండర్‌గ్రాడ్‌ సదస్సు.. - Under Graduates Summit 2022

JNTU Undergrad Summit 2022 : హైదరాబాద్‌ జేఎన్​టీయూలో స్టూమాగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ​గ్రాడ్‌ సదస్సు ఘనంగా జరిగింది. నగరంలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులను ఒక దగ్గరకు చేర్చుతూ నిర్వహించిన ఈ సదస్సులో.. విజ్ఞానం, సమాచారంతో పాటు ఆలోచనలను పంచుకునేలా రోజంతా కార్యక్రమం సాగింది.

సందడిగా అండర్‌గ్రాడ్‌ సదస్సు
JNTU Undergrad Summit 2022

By

Published : Dec 25, 2022, 1:53 PM IST

JNTU Undergrad Summit 2022 : విద్యార్థులు తమలోని ఆలోచనలకు పదునుపెట్టి.. భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకోవటమే లక్ష్యంగా హైదరాబాద్‌ జేఎన్​టీయూలో నిర్వహించిన అండర్​గ్రాడ్‌ సదస్సు సందడిగా సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, కార్పొరేట్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో "స్టూమాగ్‌" ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 300 కళాశాలల నుంచి 2,000 మంది వరకు డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్‌ సంస్థ స్కైరూట్‌ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్‌ చందానా, జేఎన్​టీయూ ప్రొఫెసర్‌ కట్టా నరసింహరెడ్డితో పాటు పలువురు వక్తల చర్చలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు విద్యావేత్తలకు ప్రత్యేకమైన వన్డే ఈవెంట్‌గా ఈ కార్యక్రమం నిలిచింది. స్కైరూట్‌ ప్రారంభం నుంచి ఎదిగిన తీరును ఆ సంస్థ వ్యవస్థాపకులు పవన్‌కుమార్‌ వివరించిన తీరు విద్యార్థులను ఆలోచింపజేసింది.

అంతరిక్షం గురించి వివరిస్తూ.. ఏరోస్పేస్‌ ప్రయోగాల తీరును ఆయన విద్యార్థులకు వివరించారు. అండర్‌గ్రాడ్‌ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు రోజంతా సందడి చేశారు. చర్చలతో పాటు స్టాండ్-అప్ కామెడీ, లైవ్ మ్యూజిక్ బ్యాండ్, లైవ్ ఇంటర్న్‌షిప్‌లతో పాటు మరెన్నో కార్యక్రమాలతో సందడిగా సాగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details