కాకినాడలో ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏమైందంటే..
CAR ACCIDENT భక్తితో పాదయాత్రగా విజయవాడ భవానీ చెంతకు వెళ్దామని అనుకున్న భక్తులను మృత్యువు తన ఒడిలో చేర్చుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని నలుగురు భవానీ భక్తులు విజయవాడకు పాదయాత్రగా బయలు దేరారు. వారి యాత్ర కాకినాడ తుని వద్దకు చేరుకోగానే అందులో ఇద్దరి వ్యక్తులపైకి కారు దూసుకొచ్చింది. దీంతో వారు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
TUNI CAR ACCIDENT కాకినాడ జిల్లా తుని వద్ద కారు బీభత్సం సృష్టించింది. తుని వద్ద జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురిలో ఇద్దరు వ్యక్తుల పైకి కారు దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా చిగడం మండలం పెనసం గ్రామానికి చెందిన నలుగురు భవానీ భక్తులు విజయవాడకి పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ యాత్రలో వారికి కారు రూపంలో ప్రమాదం దూసుకొచ్చింది. మృతి చెందిన వారు ఈశ్వరరావు, సంతు అని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.