Tiger wandering in kakinada Villages: కాకినాడ జిల్లా ప్రజలను పెద్దపులి భయపెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రమే పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన 150 మంది సిబ్బంది... ఆయా ప్రాంతాల్లో బోన్లు సిద్ధం చేశారు. పులిని బందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో ఎవరూ సంచరించవద్దని అధికారులు మరోసారి హెచ్చరించారు.
ప్రత్తిపాడు మండలం పోతులూరు వద్ద 80అడుగుల గుట్టపై పెద్దపులి తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు. రాత్రివేళల్లో సంచరిస్తున్న ఈ పులి.. సోమవారం రాత్రి ఎక్కడా సంచరించినట్లు ఆనవాలు కనిపించలేదు. పోతులూరు వద్ద ఉన్న గుట్టతో పాటు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లోనూ పులి జాడ చిక్కలేదు. అయితే గతంలో గేదెను వేటాడి గుట్టపైకి లాక్కెళ్లింది. ఇప్పుడు ఆహారం కోసం అక్కడకు వస్తుందేమోనని అటవీశాఖ అధికారులు తిష్టవేశారు.