ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు వేయించాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా కార్యకర్తలు.. ఎక్కడంటే? - AP News

Road Issue: ఏళ్ల తరబడి తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులను వేడుకున్న పట్టించుకోకపోవడంతో... స్థానిక ప్రజానీకం ఆగ్రహించి నియోజక వర్గం ఎమ్ఎల్ఏను నిలదీసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

Road Issue
రోడ్డు సమస్య

By

Published : Oct 29, 2022, 4:24 PM IST

Road Issue: తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌ను వైకాపా నాయకులు, గ్రామస్థులు నిలదీశారు. టి. రాయవరం గ్రామ రహదారి తీవ్రంగా ధ్వంసమైందని.. ఏళ్లు గడుస్తున్నాయే తప్ప రోడ్డు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా నాయకుడు నూకరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే స్వగ్రామం శంకవరం బయలుదేరారు. అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రత్తిపాడు వచ్చి తమ సమస్య చెప్పుకొన్నారు. టెండర్ వేసిన కాంట్రాక్టర్ వల్లే నిర్మాణం జాప్యమవుతోందని ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా ప్రశ్నల దాడి చేయడంతో ఎమ్మెల్యే రుసరుసలాడి వెళ్లిపోయారు. గ్రామంలో రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న వైకాపా ఎంపీటీసీ రామన్నదొరను గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details