ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుమ్ములపేటలో ఉద్రిక్తత.. నిరసన చేస్తున్న తెదేపా నేతల అరెస్టు - తెదేపా నేతల అరెస్టు

TDP PROTEST AT KAKINADA : దుమ్ములపేటలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా హయాంలో దుమ్ములపేటలో గృహ నిర్మాణానికి కేటాయించిన స్థలాల లబ్ధిదారులను రద్దు చేసి కొత్తవారికి కేటాయించడంతో.. తెదేపా నేతలు నిరసన చేపట్టారు.

TDP PROTEST AT KAKINADA
TDP PROTEST AT KAKINADA

By

Published : Sep 3, 2022, 3:47 PM IST

TDP LEADERS ARREST : కాకినాడలో తెదేపా నేతల ఆందోళనల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెదేపా హయాంలో దుమ్ములపేటలోని ప్రజలకు గృహనిర్మాణాలకు స్థలాలు కేటాయించారు. తాజగా వైకాపా అధికారంలోకి వచ్చాక పాత లబ్ధిదారులను తీసేసి కొత్తవారికి స్థలాలు ఇచ్చారు. అయితే పాతవారికి ఇవ్వకుండా కొత్తవారికి స్థలాలు ఇవ్వడంపై తెదేపా నేతలు నిరసన చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్​ చేశారు. కొత్తగా వచ్చిన లబ్ధిదారులు ఇళ్ల స్థలాల్లో టెంట్లు వేయటంతో.. పాత లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దుమ్ములపేటలో నిరసన చేస్తున్న తెదేపా నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details