Yanamala Ramakrishnudu on Graduate MLC irregularities: పట్టభద్రుల ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికార పార్టీ వైకాపా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనమన్నారు. మేధావులు, విద్యావంతులు పాల్గొనే ఎన్నికలను సైతం.. ప్యూడల్ ధోరణితో తీర్పును కొల్లగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు.. ఐదు, పది, ఇంటర్ చదివిన వారినీ.. ఈ జాబితాలో చేర్చేశారని విమర్శించారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టడంతో వారు అనర్హులకు ఓట్ల నమోదు చేయించారని మండిపడ్డారు.
వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ.. అనర్హులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు: యనమల
TDP leader Yanamala Ramakrishnudu: వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ అనర్హులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు.. ఐదు, పది, ఇంటర్ చదివిన వారినీ.. ఈ జాబితాలో చేర్చారని విమర్శించారు. వైకాపా అక్రమాలకు సహకరించి అధికారులు బలి కావద్దని హెచ్చరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో దాదాపు 10 వేల మందికి కి పైగా అనర్హులను జాబితాలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోను భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా అక్రమాలకు సహకరించి అధికారులు బలికావద్దని హెచ్చరించారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
ఇవీ చదవండి: