ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతబాబుకు బెయిల్‌ ఇస్తే.. మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందే: సుబ్రహ్మణ్యం తల్లి ఆవేదన

SUBRAMANYAM MOTHER: తన కుమారుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ ఇస్తే కుటుంబసమేతంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని దళిత యువకుడు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేశారు.

SUBRAMANYAM MOTHER
అనంతబాబుకు బెయిల్‌ ఇస్తే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందే

By

Published : Jun 14, 2022, 6:59 AM IST

SUBRAMANYAM MOTHER: తన కుమారుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ ఇస్తే కుటుంబసమేతంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని దళిత యువకుడు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కోర్టు విచారణకు కుటుంబీకులతో కలిసి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ మద్దతుతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, గతంలో అనంతబాబు నేర చరిత్రనుబట్టి బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందని నూకరత్నం తరఫు న్యాయవాది, రాష్ట్ర మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయొద్దని బాధిత కుటుంబం తరఫున తాను వేసిన కౌంటర్‌ఫైలును కోర్టు స్వీకరించిందని తెలిపారు. బాధిత కుటుంబం కోర్టు వద్ద ఉండగా ఎమ్మెల్యే ధనలక్ష్మి కారులో అనంతబాబు అనుచరులు వచ్చి వారి ఫొటోలు తీశారని ముప్పాళ్ల అభ్యంతరం తెలిపారు. రిమాండ్‌లో ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు.

Subramanyam Murder Case: డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు.. కేసు తీవ్రతను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పోలీసులు మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక.. ఖాకీల కట్టుకథను మరోసారి తెరపైకి తెచ్చింది. పోస్టుమార్టం నివేదికకు, పోలీసుల ప్రకటనకు పొంతన కుదరడం లేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు సందర్భంగా కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియా ముఖంగా చెప్పిన వివరాలివి.. అనంతబాబు నెట్టడంతో సుబ్రమణ్యం అపార్ట్‌మెంట్‌ డ్రైనేజ్‌పై పడి తలకు గాయమైందని, కారులో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే చనిపోయాడని ఎస్పీ ఆనాడు తెలిపారు. అయితే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అనంతబాబు.. సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి చెట్టుకొమ్మతో తొడలు, చేతులు, భుజం, వీపుపై కొట్టారని వెల్లడించారు.

కానీ సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మృతుడి శరీరంపైన, లోపల 34 గాయాలున్నాయని మృతదేహం కళ్లు, నోరు కొద్దిగా తెరిచి ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. శరీరంలో అంతర్గత రక్తస్రావమైందని, ఊపిరితిత్తులు కొంతమేర సాగాయని.. రంగరాయ వైద్యకళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టెక్నాలజీ ప్రధానాచార్యునితోపాటు, సహ ఆచార్యుడు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో స్పష్టం చేశారు. మరణానికి ముందే మృతదేహంపై గాయాలున్నట్లు.. పేర్కొన్నారు.

ఇవన్నీ బలమైన, మొద్దుబారిన వస్తువుతో బతికుండగానే కొట్టినవని పొందుపరిచారు. నిజానికి కొట్టిన గాయాల వల్లే సుబ్రమణ్యం చనిపోయాడని పోలీసులు మే 21న శవపంచనామా సమయంలోనే గుర్తించారు. తల, వీపు, కాళ్లు, చేతుల మీద బలంగా కొట్టడం వల్ల తగిలిన గాయాలకే చనిపోయినట్లు పైకి కనిపిస్తోందని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహంపై 15 గాయాలున్నట్లు పంచనామా నివేదికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఇతర గాయాలనూ మరింత లోతుగా వైద్యనిపుణులు పరీక్షించి ఎన్ని సెంటీమీటర్ల లోతున తగిలాయో కొలతలతో సహా పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు మృతుడి శరీరంలో అవయవాలను చిన్నచిన్న ముక్కలుగా సేకరించి విజయవాడలోని ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌తో పాటు రంగరాయ వైద్య కళాశాలలోని పాథాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో మరింత స్పష్టత రానుండగా నివేదికలు అధికారికంగా అందడానికి మరో 2 నెలలు పడుతుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details