ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLC Ananthababu case: ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా?: సుబ్బారావు - కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య వార్తలు

MLC Ananthababu case: ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి.. వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ని హతమార్చిన కేసును.. కాకినాడ ఎస్పీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అనంతబాబు కాల్‌డేటా తీసుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.

state president of the Civil Rights Association subbarao reacts on MLC Ananthababu case
ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా?: సుబ్బారావు

By

Published : Jun 11, 2022, 1:40 PM IST

ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా?: సుబ్బారావు

MLC Ananthababu case: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ని హతమార్చిన కేసును.. కాకినాడ ఎస్పీ పక్కదారి పట్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ఆరోపించారు. అనంతబాబు, మరికొందరితో కలిసి కిరాతకంగా కారు డ్రైవర్‌ను చంపాడన్నారు. ఒక్కరే హత్య చేస్తే.. శరీరంపై 31, అంతర్గతంగా 3 గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అనంతబాబును కాపాడేందుకే నేరచరిత్ర లేదని కోర్టుకు పోలీసులు తెలిపారన్నారు. అసలు హత్య ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పట్లేదని ఆరోపణలు చేశారు. ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా అని నిలదీశారు.

అనంతబాబు కాల్‌డేటా తీసుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. హత్య కేసులో మిగతా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details