SI Suicide: కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ... సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. గన్ మిస్ ఫైర్ అయ్యి ఎస్సై చనిపోయారని... ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. గోపాలకృష్ణ మృతితో ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SI Suicide: కావాలనే కాల్చుకున్నారా..? మిస్ ఫైర్ అయ్యిందా..??
08:05 May 13
దుష్ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు... - కాకినాడ డిఎస్పీ
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్.ఐ.గా ఎంపికై ఉమ్మడి తూర్పుగోదావరిలో పని చేశారు. 2021 ఆగస్టు నుంచి కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంతో కలిసి నాగమల్లితోట జంక్షన్‌లో నివాసముంటున్నారు. గురువారం సీఎం బందోబస్త్‌కు వెళ్లి వచ్చి నిద్రపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఓ గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో హాల్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం పొందారు. విధి నిర్వహణలో ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం గన్ మిస్‌ఫైర్ అయ్యిందని చెబుతున్నారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబసభ్యులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఎస్ఐ గోపాలకృష్ణ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గోపాలకృష్ణ స్వస్థలం నవాబుపేటలో విషాదం నెలకొంది. చిన్ననాటి నుంచి అందరితో కలుపుగోలుగా ఉండే గోపాలకృష్ణ... ఈ విధంగా చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. 2013లో వీఆర్వోగా ఎంపికైనా పోలీసు ఉద్యోగంపై మక్కువతో ఎస్ఐగా వెళ్లారని అంటున్నారు.
గోపాలకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. ఉద్యోగంలో ఒత్తిడి వల్లే చనిపోయారన్నది అవాస్తవమని... ఇలాంటి దుష్ప్రచారాలతో పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: