tiger roming in kakinada: కాకినాడ జిల్లాలో పులి భయం ఇంకా తొలగిపోలేదు. ప్రత్తిపాడు మండలం పోతులూరు నుంచి శంఖవరం మండలం వజ్రకూటం, కత్తిపూడి, గొల్లప్రోలు మండలం కొడవలి పరిసరాలకు చేరిన పులి జాడ కోసం అటవీ, వణ్యప్రాణి యంత్రాంగం గాలించారు. పులి గ్రామాల్లో సంచరిస్తోందన్న సమాచారంతో సిబ్బంది పరుగులు పెడుతున్నారు. స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటు తిరుగుతున్నారు. సోమవరం పులి పాదముద్రలు లభించలేదు. పులి భయంతో గ్రామీణ రహదారులు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు పల్లెల్లో ప్రచారం చేస్తున్నారు.
అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి.. చిక్కదు.. వెళ్లదు - tiger roming in kakinada district
Tiger Searching Continue: రోజులు గడుస్తున్నప్పటికీ కాకినాడ జిల్లాలో పులి సంచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రత్తిపాడు నియోజగవర్గం పరిధిలో తిరుగుతున్న పులి జాడ కోసం అటవీ, వణ్యప్రాణి యంత్రాంగం గాలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
tiger roming in kakinada district