Rape: కాకినాడలో దారుణం.. బాలికపై ప్రైవేటు వసతిగృహం నిర్వాహకుడు అత్యాచారం - kakinada rape news
09:48 June 05
పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
Rape: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దురాఘతాలు కాస్త తగ్గుముఖం పట్టయానుకుంటున్న సమయంలో.. కాకినాడ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ప్రైవేటు హాస్టల్ నిర్వాహకుడు విజయకుమార్ అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. కరోనా నివారణ మందు పేరిట మత్తు మందు ఇచ్చి దారుణానికి తెగబడినట్లు బాలిక తెలిపింది. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమెకు గర్భస్రావమైనట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలిని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయకుమార్ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: