MONEY BAGS AT DEAD SAINT: ఎవరికైనా తినే ప్రతి గింజ మీద.. వారి పేరు రాసి ఉంటుందనేది ఎంత నిజమో.. ఖర్చు పెట్టే ప్రతి పైసా మీద పేరు ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన రూపాయిని కూడా ఖర్చు పెట్టకుండానే చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో జరిగింది. కరప మండలం వేళంగిలో గుండెపోటుతో రామకృష్ణ అనే సాధువు మరణించాడు. అయితే అతడి వద్ద డబ్బు సంచులు బయటపడ్డాయి. బిక్షాటన చేస్తూ, రక్షా రేకులు కడుతూ జీవనం సాగిస్తుండగా నిన్న గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయాడు. అతని మృతదేహాన్ని పరిశీలించేందుకు వచ్చిన పోలీసులు గదిలో ఉన్న రెండు డబ్బు సంచులను చూసి ఆశ్చర్యపోయారు. పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రెండు లక్షల రూపాయల వరకు రామకృష్ణ కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.
MONEY BAGS AT DEAD SAINT: చనిపోయిన సాధువు.. గదిలో చూస్తే డబ్బులే డబ్బులు.. ఎంతంటే..!
MONEY BAGS AT DEAD SAINT: దేనికైనా అదృష్టం అనేది ఉండాలంటారు.. అది కూర్చొని తినడానికైనా.. లేదా సంపాదించింది ఖర్చు పెట్టడానికైనా.. ఎందుకంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన.. దానిని ఖర్చుపెట్టకుండానే చాలా మంది కన్నుమూస్తున్నారు. ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో జరిగింది. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ సాధువు గుండెపోటుతో మృతి చెందాడు. మీకు సందేహం రావొచ్చు.. పైన చెప్పిన దానికి ఈ సాధువుకి సంబంధం ఏంటని. అది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
చనిపోయిన సాధువు వద్ద డబ్బు సంచులు