ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ఎక్కడుంది జగనన్న - అన్నీ గుంతలే కనిపిస్తున్నాయి! కాకినాడ -సామర్లకోట రహదారిపై ప్రయాణికుల బెంబేలు - Peoples problems on roads in Kakinada district

Peoples Problems on Roads in Kakinada District నాలుగేళ్లుగా మరమ్మత్తులు కరువు, కొత్త రోడ్లు లేవు. రాష్ట్ర రోడ్ల దుస్థితిపై ప్రజలు, విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. మూలిగే నక్కపై తాటిపండు చందానా గుంత రోడ్లపై మిగ్​జాం తుపాను కూడా తన ప్రతాపం చూపించింది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో రోడ్లు ప్రయాణికులకు నరకం మరింత చేరువైందన్నట్లుగా మారింది. జిల్లాలో 11 నియోజకవర్గాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే కాకినాడ-సామర్లకోట రహదారిపై ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది.

Peoples_Problems_on_Roads_in_Kakinada_District
Peoples_Problems_on_Roads_in_Kakinada_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:55 AM IST

Updated : Dec 8, 2023, 1:20 PM IST

Peoples Problems on Roads in Kakinada District : అడుగుకొక గుంత ఆపైన భారీ గొయ్యిలు, గోతుల మధ్య రహదారి ఎక్కడ ఉందో వెతుక్కుని వాహనాలు నడపాల్సి వస్తోంది. ఇదీ కాకినాడ- సామర్లకోటలో రోడ్డులో ప్రయాణికుల దుస్థితి. కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికే గంటకు పైగా సమయం పడుతుంది. ముత్యాలమ్మ గుడి నుంచి మాధవపట్నం గ్రామ శివారు వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. తుపాన్ ప్రభావంతో గోతులన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గోదావరి కాల్వకు తూములు వేసి పూడ్చివేశారు. వరద కాల్వలో పోటెత్తడంతో రోడ్డును ముంచెత్తింది. దీంతో వాహనదారుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.

అన్నీ గుంతలే! రోడ్డు ఏది జగనన్నా? - వాహనచోదకులకు ప్రాణసంకటం

Condition of Kakinada Samarlakota Road :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యం కీలకమైన ఈ రహదారిపై దాదాపు 11 నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాకినాడ నగరానికి వెళ్లే అతి ప్రధాన రహదారి ఇదే కావడంతో నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదే ప్రయాణిస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ రహదారిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం గుంతలు పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.

Rain Water on Roads in Kakinada District : కాకినాడ-సామర్లకోట రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సామర్లకోట నుంచి కాకినాడ వరకు 15 కిలోమీటర్లు ఉంది. ముత్యాలమ్మ గుడి నుంచి మాధవపట్నం గ్రామ శివారు వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయింది. ఈ దారిలో రోడ్డు ఎక్కడ ఉందో వెతుకోవాల్సిన దుస్థితి. వాహనాలు పాము మెలికల మాదిరిగా నడపాల్సిన పరస్ధితి. ఏ మాత్రం ఏమరుపాటుగా వాహనం నడిపినా ప్రమాదానికి గురికావల్సిందే. అంతేగాక తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో గోతులు పూర్తిగా నీటితో నిండిపోయాయి.

వైసీపీ పాలకుల నిర్లక్ష్యం - నాలుగున్నరేళ్ల పాలనలో 20 శాతం పనులనూ పూర్తి చేయని ప్రభుత్వం

Problems on Roads in AP :అదేవిధంగా అనపర్తి, రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, రంపచోడవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ గ్రామీణం నియోజకవర్గాల ప్రజలు కాకినాడ చేరుకోవాలంటే ఇదోక్కటే మార్గం. అలాగే రాజమండ్రి విమానాశ్రయం, సామర్లకోట రైల్వే జంక్షన్ నుంచి కాకినాడ చేరుకునే ప్రయాణికులు ఈ రోడ్డుపైనే వెళ్లాలి.అంతేగాక బయట ప్రాంతాల నుంచి నిత్యం వేల మంది ప్రయాణికులు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు పై వాహనదారులు నరకాన్ని చూస్తున్నారు.

Conditions of National Highways in AP : సామర్లకోట-కాకినాడ రోడ్డు విస్తరించాలని దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కాకినాడ పరిధిలో ప్రతాప్ నగర్ వరకు విస్తరించారు. మాధవపట్నం, వీకేరాయపురం గ్రామాల మధ్య విస్తరణ పనులు నిలిపేశారు. తీవ్రంగా ధ్వంసమైన రోడ్డును కనీస మరమ్మత్తులు చేయడం లేదు. అతికష్టంపై వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం మరింత కష్టంగా మారుతుంది. మాధవపట్నం వంతెన వద్ద పెద్ద పెద్ద గోతులు తప్పించే క్రమంలోనూ, ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ట్రాఫిక్ జాంతో ప్రయాణం తీవ్ర ఆలస్యమవుతుంది. నిత్యం వేల వాహనాలు, అధిక రద్దీ ఉండే ఈ రోడ్డుపై వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుపుతున్నారు.

Lack of Facilities in Autonagar: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నా.. కనీస వసతులకు నోచుకోక అల్లాడుతున్న ఆటోనగర్‌

రోడ్డు ఎక్కడుంది జగనన్న - అన్ని గుంతలే కనిపిస్తున్నాయి!
Last Updated : Dec 8, 2023, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details