ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rachabanda: ఎండైనా.. వానైనా.. హాయిగా సేద తీరొచ్చు - కాకినాడ తాజా వార్తలు

Rachabanda: ఎండాకాలం వచ్చిందంటే చాలామంది చెట్ల నీడల కింద సేద తీరుతారు. ఇంటి చుట్టుపక్కల వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. అయితే చెట్ల కింద కూర్చుంటే ఆకులు రాలడం లేదా పురుగులు మీద పడటం లాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా కూర్చోడానికి పెద్ద మర్రి చెట్టు ఉంది. కాకపోతే అక్కడి గ్రామస్థులు ఎండైనా, వానైనా విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రచ్చబండపై రేకుల షెడ్డు వేసి హంగులు దిద్దారు. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసుకోవాలనుందా?

Rachabanda
"రచ్చబండ.. చల్లగుండ"

By

Published : May 8, 2022, 9:39 AM IST

Rachabanda: భారీ మర్రి వృక్షం.. ఆ కింద విశాలమైన రచ్చబండ. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని కొంతంగి కొత్తూరులో వ్యవసాయ పనులు అయ్యాక.. ఖాళీ సమయాల్లో గ్రామస్థులు అక్కడికొచ్చి సేద తీరుతున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. పక్షులు పాడు చేయకుండా, ఆకులు కిందపడకుండా రచ్చబండపై రేకుల షెడ్డు వేసి హంగులు దిద్దారు. దీంతో ఎండైనా, వానైనా అక్కడ విశ్రాంతి తీసుకునే వీలు దక్కింది. ఎండల్లో అటుగా రాకపోకలు సాగించేవారు సైతం కాసేపు ఆగి ఈ చెట్టు నీడన సేద తీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details