ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డెంటిస్ట్ కిడ్నాప్​ నిందితుడు నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధం లేదు' - టీ టైం ఎండీ అర్జున్​ గణేశ్​

Naveen Reddy has nothing to do with Teatime: నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను టీ టైం ఎండీ అర్జున్​ గణేశ్ ఖండించారు. ​అసలు టీ టైంకు ఆదిభట్ల నిందితుడికి సంబంధం లేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో తమ సంస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు.

Naveen Reddy has nothing to do with Teatime
Naveen Reddy has nothing to do with Teatime

By

Published : Dec 10, 2022, 6:02 PM IST

'డెంటిస్ట్ కిడ్నాప్​ నిందితుడు నవీన్​రెడ్డికి టీ టైంకు సంబంధం లేదు'

Naveen Reddy has nothing to do with Teatime:తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో అమ్మాయి కిడ్నాప్​నకు సంబంధించి టీం టైం సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ అర్జున్​ గణేశ్​ తెలిపారు. కొన్ని మీడియా ఛానెల్​లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అసలు టీ టైంకు ఈ సంఘటనకు ఎటువంటి సంబంధంలేదని ప్రకటించారు. ఈ కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నవీన్​రెడ్డికి టీం టైంతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

3500 అవుట్​ లెట్లు కలిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థపై తప్పుడు కథనాలు రాయడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే బ్రాండ్​ విలువ.. నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. దయచేసి అందరూ ఇలాంటి అవాస్తవాలు ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

"నవీన్​రెడ్డికి టీ టైం సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. కొన్ని మీడియా ఛానెల్స్​లో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. 3500 షాపులు కలిగి ఎంతో మందికి ఉపాధి ఇస్తున్న సంస్థపై తప్పుడు ఆరోపణలు సరికాదు. దీనివల్ల సంస్థ బ్రాండ్​.. సంస్థపై ఉన్న నమ్మకం పోతాయి. నేనే టీ టైం ఎండీనీ.." -అర్జున్​ గణేశ్​, టీ టైం ఎండీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details