Nara Lokesh Yuvagalam Padayatra: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రెండు రోజులపాటు కొనసాగిన యువగళం పాదయాత్ర బుధవారం రాత్రి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్దకు చేరుకుంది. నేడు కాకినాడ జిల్లాలో ఉత్సాహంకో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగుతోంది.
Lokesh Yuvagalam Padayatra 213th Day: ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో గురువారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సుంకరపాలెంలో బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరగా.. మార్గమధ్యలో జాతీయ రహదారి ప్రక్కన లోకేశ్‌ను చూసేందుకు వేచి ఉన్న స్థానిక రవి డిగ్రీ కాలేజీ విద్యార్థినితో ముచ్చటించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు.
పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్
మల్లవరం సెంటర్లో మహిళలతో సమావేశమై బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల వివరాలు వివరించారు. లోకేశ్ వెంట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు.. యువజన సంఘం అధ్యక్షుడు ధూళిపూడి బాబి, మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Nara Lokesh Tweet on Andhra Pradesh Roads: ఏపీకి జగన్ వద్దనటానికి అనేక కారణాలున్నాయని.. రాష్ట్రం గుంతల రాజ్యంగా మరటానికి ఆయన దరిద్రమూ ఓ కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో బురదమయంగా మారిన మెయిన్ రోడ్డును చూడండంటూ ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. బురద గుంతగా మార్చిన.. జగనే ఎందుకు కావాలి, ఎందుకు రావాలని జనం ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు.