ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అడ్వాన్స్‌ తీసుకొని అద్దెకిచ్చే పార్టీ జనసేన' - మంత్రి దాడిశెట్టి రాజా వార్తలు

వైకాపా పాలనలో కేవలం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు మాత్రమే కష్టాలు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నపుడల్లా ఆయన కన్నీళ్లు తుడిచేందుకు... పవన్‌ ముందుంటారని ఎద్దేవా చేశారు. అడ్వాన్స్‌ తీసుకొని అద్దెకిచ్చే పార్టీ జనసేన అని విమర్శించారు.

దాడిశెట్టి రాజా
దాడిశెట్టి రాజా

By

Published : Apr 24, 2022, 5:45 AM IST

అడ్వాన్సు తీసుకొని అద్దెకిచ్చే పార్టీ జనసేన అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరంలోని తన కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు.

'అడ్వాన్స్‌ తీసుకొని అద్దెకిచ్చే పార్టీ జనసేన'

వైకాపా పాలనలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పవన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కష్టాలన్నీ ఆయనకు, చంద్రబాబుకేనని ఎద్దేవా చేశారు. శనివారం పవన్‌ పర్యటనలో జనసేన కార్యకర్తలు జై జగన్‌ అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కష్టాల పాలైనప్పుడు ఈ వీరమల్లులు ఏమైపోయారని ప్రశ్నించారు. తెదేపా వద్ద తీసుకున్న ప్యాకేజీ అడ్వాన్సు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమోనని నాడు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టి తనను నమ్ముకున్నవారిని అమ్ముకోవడానికి 2014లో అనుసరించిన పంథానే పవన్‌కల్యాణ్‌ 2024లోనూ కొనసాగిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఇదీ చదవండి:నేనెవరికీ దత్తున్ని కాదు.. సొంతవాళ్లున్నారు : పవన్

ABOUT THE AUTHOR

...view details