constable raped a woman : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన సంఘటన పోలీసు వర్గాల్లోనూ దుమారం రేపుతోంది. హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు దంపతులు, వివాహిత ఇంటి సమీపంలో ఉండేవాడు. బాధితురాలు, కానిస్టేబుల్ భార్య.. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో చనువుగా ఉండే కానిస్టేబుల్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతన్ని తిరస్కరించడంతో మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలెట్టాడు.
పద్ధతి మార్చుకోకపోవడంతో బాధితురాలు సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఐనప్పటికీ వేధింపులు మాత్రం ఆపలేదు. పైగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు మరోసారి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.