నిజాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో వైకాపా ప్రభుత్వం బలితీసుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణని వెంటాడి వేధించి చంపేశారని ఆరోపించారు. 'ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది' అని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. కక్ష సాధింపుల వల్లే గోపాలకృష్ణ మరణించగా.., సాటి పోలీసులే కట్టుకథలు అల్లటం విచారకరమన్నారు.
నిజాయతీగా పనిచేసే పోలీసు అధికారిని బలి తీసుకున్నారు: లోకేశ్ - ఎస్ఐ ఆత్మహత్యపై లోకేశ్ కామెంట్స్
వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే సర్పవరం ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. నిజాయతీగా పనిచేసే పోలీసు అధికారిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.
నిజాయతీగా పనిచేసే పోలీసు అధికారిని బలి తీసుకున్నారు
ఎస్ఐ అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. మృతిచెందిన గోపాలకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. చనిపోయింది తమవాడు కాదనుకునే పోలీసుల వరకూ ఈ కక్ష సాధింపులు వస్తాయని.., అప్పుడు వారి వైపు ఎవరూ ఉండరని లోకేశ్ అన్నారు.
ఇవీ చూడండి