Sankranti Celebrations: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, జూదం ఇతర ఆటలకు దురంగా ఉండాలని కోరుతూ.. కాకినాడ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాళ్లరేవు మండలం కోరంగి పోలీసులు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కళాశeల విద్యార్థులతో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించి పిండివంటలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు.. కళాశాల విద్యార్థులు సంక్రాంతి ఉత్సవాన్ని తెలియజేసే రంగవల్లులు తీర్చిదిద్దగా. దిశ పోలీస్ మేము మీకు రక్షణ అంటూ ముగ్గును తీర్చిదిద్దారు. యువకులకు వాలీబాల్ పోటీ నిర్వహించారు. జూద క్రీడలు వద్దు సంప్రదాయ సంక్రాంతి సంబరాలే ముద్దు అని నినదించారు.
జూద క్రీడలు వద్దు.. సంక్రాంతి సంబరాలే ముద్దు.. పోలీసుల వినూత్న కార్యక్రమం - Police Innovative Programme
Sankranti celebrations: కాకినాడ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, జూదం ఇతర ఆటలకు దూరంగా ఉండాలని కోరుతూ... కోరంగిలో కళాశాల విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
జూద క్రీడలు వద్దు... సంక్రాంతి సంబరాలే ముద్దు