ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kingdom Belongs To Those Have Cases in YSRCP in AP: వైసీపీలో కేసులున్నా వారికే కీలక పదవులు.. వారిదే రాజ్యం.. వారికే మర్యాదలు!

Kingdom Belongs To Those Have Cases in YSRCP in AP: నేరారోపితుల్ని రాజకీయ పార్టీలు సాధారణంగా దూరం పెడతాయి. నేరగాళ్లను పార్టీ నుంచి.. బహిష్కరిస్తుంటాయి. కానీ అధికార వైఎస్సార్సీపీలో కేసులున్న వారిదే రాజ్యం.! హత్యలు చేసి జైలుకెళ్లొచ్చినా వారికి లోటుండదు. దౌర్జన్యాలు చేసినా అడ్డుకునే వారుండరు! అంతా ఆటవికమే! వైసీపీలో అదే గుర్తింపు అన్నట్లు.. చెలరేగుతున్నారు. అధిష్టానం అండతో గాడి తప్పుతున్నారు.

kingdom_belongs_to_those_have_cases_in_YSRCP
kingdom_belongs_to_those_have_cases_in_YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 7:13 AM IST

kingdom_belongs_to_those_have_cases_in_YSRCP: వైసీపీలో కేసులున్నా వారికే కీలక పదవులు

Kingdom Belongs To Those Have Cases in YSRCP in AP :ఎమ్మెల్సీ అనంత బాబు.. వైసీపీ శాసన మండలికి పంపిన వారిలో ఈయనకు వచ్చినంత గుర్తింపు బహుశా కొందరు మంత్రులకూ లేదంటే అతిశయోక్తికాదు.! దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ (MLC Anantha Babu Driver Murder Case) చేసిన కేసుతో ఆయన ఓ వెలుగు వెలిగారు. ఏడాది పాటు జైలుకు వెళ్లి వచ్చినా వైసీపీ అధిష్టానం ఆయన పరపతిని ఎక్కడా తగ్గించలేదు.! పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు కదా అంటారా.?

అప్పట్లో ఏదో ప్రజాసంఘాలు, దళిత వర్గాల పోడు పడలేక సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.. ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన దళితులు, ఆదివాసీల నిరసనపై నీళ్లు చల్లడానికి వాడిన ఓ కాగితమే. అనంత బాబు జైలు నుంచి బెయిల్​పై విడుదల అయితే ర్యాలీగా తీసుకొచ్చింది వైసీపీ నేతలే. ఆ తర్వాత రంపచోడవరం, కూనవరంలో తన ఆధిపత్యం చాటేందుకు అనంత బాబు రెండు బహిరంగ సభలు పెట్టారు. సభల్లో వైసీపీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి కూడా పాల్గొన్నారు.

YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

మరి పార్టీ నుంచి సస్పండ్‌ చేసిన వ్యక్తి సభలకు వెళ్లిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.? అంతెందుకు గత ఆగస్టులో కూనవరంలో జరిగిన సీఎం సభలో అనంత బాబు కూడా వేదికను పంచుకున్నారు. అంటే అనంత బాబు సస్పెన్షన్‌ ఉత్తిదేనని, ఆయనకు అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే!

YSRCP Leaders are Accused in the Cases :వైసీపీలో అనంత బాబు తరహా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య కేసులో అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ బజారయ్యపై పోలీసులు అరెస్ట్​ చేశారు. అప్పట్లో బజారయ్యను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన యధావిధిగా వైసీపీ నేతగా తిరుగుతున్నారు.

YSRCP Leader Followers Attack: నెంబర్​ లేని కార్లతో మంత్రి జోగి రమేష్ అనుచరుల హల్​చల్.. భక్తులపై దాడి

YSRCPLeaders Attacks :సత్తెనపల్లి పరిధిలో ఇటీవల సాయి, కిశోర్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి కారుపై దాడి చేశారు. ముప్పాళ్ల పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా, వారిని తమకు అప్పగించాలంటూ వెంకటేశ్వర రెడ్డి అనుచరులు స్టేషన్​లో హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలో ఎస్సైపైనే దాడి చేశారు.

విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ, అనంతపురంలో వైసీపీ నేత రామకృష్ణా రెడ్డి, విజయవాడలో చౌడేష్‌, కడపలో శ్రీనివాస రెడ్డిని హత్య కేసుల్లో నిందితులు వైసీపీ నేతలే.! ఇలా. వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో ఆ పార్టీలో కొందరు నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగుతున్నారు. వైసీపీ నేతల భూకబ్జాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాల్లో ఎక్కువగా బాధితులు దళిత, బడుగు జీవులే! ఇలాంటి దాష్టీకాలను నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందనేది ప్రశ్నార్ధకం.

YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్​తీరు

ABOUT THE AUTHOR

...view details