Attack on Tenali councilor: వైసీపీ అనుసరిస్తున్న విధానంపై టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ నేతలు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ధన దాహానికి ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. కౌన్సిల్ సమావేశంలో సింగిల్ టెండర్ పై ప్రశ్నించిన యగంధర్ పై దాడిచేసిన ఘటన సిగ్గుచేటని విమర్శించారు. దాడికి సంబందిచిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీ నేతలంతా కలిసి ఆందోళన చేస్తామని కన్నా వెల్లడించారు.
కన్నా లక్ష్మీనారాయణ: గుంటూరు జిల్లా, తెనాలిలో వైసీపీ కౌన్సిలర్లు చేతిలో దాడి కి గురైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ ఇంటికి వచ్చి మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. గొడవకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనను కన్నా లక్ష్మినారాయణకు యుగంధర్ వివరంగా చెప్పారు. ఘటనకు గల కారణాలు వెల్లడించారు. వైసీపీ నేత ప్రవర్తించిన తీరును యుగంధర్ తెలిపాడు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మినారాయణ మాట్లాడారు. వైసీపీ దురుదేశంతో ఏర్పడి పార్టీ అని విమర్శించారు. వైసీపీ పుట్టుకే మోసం అని ఆరోపించారు. పార్టీకి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకున్నారనీ.. అయితే, వైసీపీ ఆచరించేది మాత్రం రాజారెడ్డి సిద్ధాంతమని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు దాడి చేస్తే దాడిలో గాయపడిన వారిపై పోలీసులు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని కన్నా మండిపడ్డారు.
ఒక్క చాన్స్ అని జగన్‌కి ప్రజలు అవకాశం ఇస్తే.. జగన్ స్వంత ఎజెండా, సొంత వ్యాపారాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొందని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. సొంత వ్యాపారం, సొంత ఎజెండాలపై ఎవరన్న విమర్శలు చేస్తే పోలీసులు, వైసీపీ కార్యకర్తలతో కలిసిపోయి దాడులుచేస్తూన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.