Kakinada TDP Zone-2 Meeting Updates: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో నిర్వహించిన జోన్-2 సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై, వైఎస్సార్సీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇకపై సైకిల్ అన్‌స్టాపబుల్.. బ్రేకులు వేయాల్సిన పనే లేదు.. ప్రతి నియోజకవర్గం నుంచి అమరావతికి సైకిల్ పంపాలి.. జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎన్నికల్లో ఈ విధ్వంసక వైసీపీని ఇంటికి పంపండి-తెలుగుదేశం పార్టీని అమరావతికి పంపండి.' అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Chandrababu Said Dialogues in Rajinikanth Style: 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' 45 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడలో నిర్వహించిన జోన్-2 సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేతనారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్య మధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్‌లో డైలాగ్‌లు చెప్పి, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. గత నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన విధ్వంసాల గురించి చంద్రబాబు ఒక్కొక్కటిగా వివరించారు.
Chandrababu Comments: ''ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనమే గెలిచాం. మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడు రాసిన స్క్రిప్ట్ తిరగబడింది. రేపు ఎన్నికలు పెట్టినా టీడీపీ జెండా ఎగరడం ఖాయం. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ఇంత విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ లేని విధంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరిగింది. కందిపప్పు డబుల్ సెంచరీ దాటింది. ధరల పెరుగుదలపై ఎవరైనా అడిగితే దాడులు, కేసులు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోనూ అరాచకాలు, హత్యలు చేశారు.'' అని చంద్రబాబు అన్నారు.