ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ జిల్లాలో మాండౌస్ తుఫాన్ ప్రభావం..

Tufan effect: మాండౌస్ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతాలపై పడింది. అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటడంతో సముద్ర కెరటాలు బీభత్సం సృష్టించాయి. వేగమైన గాలితో భారీ రాకాసి కెరటాలు ఎగసి గ్రామాలపై పడడంతో అనేక గృహాలు నేలకూలి సముద్ర గర్భంలో కలిసిపోయాయి.

tufan effect
తుఫాన్ ప్రభావం

By

Published : Dec 10, 2022, 10:01 PM IST

Tufan effect: మాండౌస్ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతాలపై పడింది. శుక్రవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటి సమయంలో ఉప్పాడలో తీరంలో కెరటాలు బీభత్సం సృష్టించాయి. వేగమైన గాలితో భారీ రాకాసి కెరటాలు ఎగసి గ్రామాలపై పడడంతో అనేక గృహాలు నేలకూలి సముద్రంలో కలిసిపోయాయి. దీంతో అనేక కుటుంబాలు నిలవడానికి నీడలేక రోడ్డుపడ్డాయి. మరోపక్క ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా కోతకు గురి ప్రమాదకరంగా మారింది. దీంతో రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం భారీ రాళ్లతో తాత్కాలిక మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి కోత సమస్య పరిష్కారం చేయాలంటూ స్థానిక మత్స్య కారులు అధికారులను వేడుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details