ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాణిజ్య ఎగుమతుల హబ్​గా కాకినాడ మరింత కీలక పాత్ర: నిర్మలా సీతారామన్ - Launch of Indian Institute of Foreign Trade

Indian Institute of Foreign Trade in ap: కాకినాడలో ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్​టీ)ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. విద్యార్థులు కోర్సును అకాడమీ డిగ్రీల సాధన కోసం కాకుండా.. ప్రపంచ వాణిజ్య స్థితిగతులపై అవగాహన కలిగి ఉండాలని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Indian Institute of Foreign Trade
కాకినాడలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్

By

Published : Oct 28, 2022, 10:29 PM IST

Indian Institute of Foreign Trade in Kakinada: కాకినాడలో ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( ఐఐఎఫ్​టీ)ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. కాకినాడ జేఎన్టీయూలో తాత్కలికంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్​టీ దక్షిణాదిలోనే తొలి క్యాంపస్. ఐఐఎఫ్​టీ ఏర్పాటుతో వాణిజ్య ఎగుమతుల హబ్​గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషిస్తుందని నిర్మాలా సీతారామన్ అన్నారు. ఐఐఎఫ్​టీ విద్యార్థులు తమ కోర్సును కేవలం అకాడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితిగతులు, సదావకాశాలను అధ్యయనం చేసి దేశ ఆర్థిక పురోగగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దేశ వాణిజ్యానికి మేనేజ్​మెంట్ నిపుణులు అవసరం ఎంతో ఉందని.. అది ఐఐఎఫ్​టీతీర్చగలదని మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన, సీదిరే అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు.. మెుదలైన నాయకులు పాల్గొన్నారు.

వాణిజ్య ఎగుమతుల హబ్​గా కాకినాడ మరింత కీలక పాత్ర: నిర్మలా సీతారామన్

ABOUT THE AUTHOR

...view details