Hospital cheating : గర్భిణి అని చెప్పి తొమ్మిది నెలలు వైద్యం చేసి.. తీరా ప్రసవం సమయానికి కాదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరంకు చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ గాంధీనగర్ లోని రమ్య ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరిలో మహాలక్ష్మికి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి అని ఆసుపత్రిలో నివేదికలు ఇచ్చారు.
Pregnancy: గర్భవతి అన్నారు.. ప్రసవానికి వెళ్తే అసలు గర్భమే దాల్చలేదన్నారు - Hospital cheating
Hospital cheating : తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చారు సత్యనారాయణ . ఆమె గర్భం దాల్చిందని తొమ్మిది నెలల పాటు పరీక్షలు, స్కానింగ్‌లు చేశారు. సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ప్రతి నెల మందులు సైతం ఇస్తూ వచ్చారు. పుట్టింటికి వెళ్లిన మహాలక్ష్మి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వైద్యులు ఆమె గర్భవతి కాదని తేల్చారు.
Pregnancy
అప్పటి ఆసుపత్రిలో క్రమంతప్పకుండా ఆసుపత్రిలో స్కానింగ్ లు, వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుకుంటున్నారు. ఈ నెల 22న ప్రసవం తేదీ కూడా ఇచ్చారు. మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. ఆమె గర్భవతి కాదని తేల్చారు. తిరిగి కాకినాడలోని రమ్య ఆసుపత్రికి వచ్చి నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పారని ఆమె తల్లి కమలాదేవి, కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 21, 2022, 10:58 AM IST